ప్రధానోపాధ్యాయుల అకౌంట్ టెస్ట్ రాసేందుకు దరఖాస్తులు సమర్పించాలని డీఈవో డి.మధుసూదనరావు మంగళవారం తెలిపారు. పరీక్ష ఫీజు అపరా«ద రుసుం లేకుండా నవంబర్ 7వ తేదీలోగా రూ.150 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రూ.60 అపరాధ రుసుంతో 14వతేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉందని తెలిపారు.
హెచ్‌ఎం అకౌంట్ టెస్ట్‌కు దరఖాస్తుల ఆహ్వానం
Oct 25 2016 9:52 PM | Updated on Sep 4 2017 6:17 PM
ఏలూరు సిటీ : ప్రధానోపాధ్యాయుల అకౌంట్ టెస్ట్ రాసేందుకు దరఖాస్తులు సమర్పించాలని డీఈవో డి.మధుసూదనరావు మంగళవారం తెలిపారు. పరీక్ష ఫీజు అపరా«ద రుసుం లేకుండా నవంబర్ 7వ తేదీలోగా రూ.150 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రూ.60 అపరాధ రుసుంతో 14వతేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. పరీక్ష డిసెంబర్ 30, 31 తేదీల్లో ఉదయం 11.30 గంటల నుంచి 2.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్ష రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్టణం, కాకినాడ, గుంటూరు, వైఎస్సార్ కడప కేంద్రాల్లో నిర్వహిస్తారని తెలిపారు.
Advertisement
Advertisement