నూతన రాజధానిలో తొలిసారి కేబినెట్ సమావేశమైంది.
విజయవాడ : నూతన రాజధానిలో తొలిసారి కేబినెట్ సమావేశమైంది. విజయవాడలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో ముందుగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి కేబినెట్ సంతాపం తెలిపింది. రాజధాని నిర్మాణం, హౌసింగ్, హుద్హుద్ బాధితులకు ఇళ్ల నిర్మాణం, వర్షాభావం, కరువు పరిస్థితులు తదితర అంశాలపై కేబినెట్ చర్చిస్తోంది.
రానున్న నెల రోజుల్లో ముఖ్యమైన కార్యాలయాన్నింటిని విజయవాడ తరలించాలని ముఖ్యమంత్రి నిర్ణయించిన నేపథ్యంలో విజయవాడలో క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు శనివారం కూడా విజయవాడలోనే ఉంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ సమావేశాన్ని ఎ కన్వెన్షన్ హాలులో నిర్వహిస్తారు. కాగా సమావేశానికి ముందు చంద్రబాబు నాయుడు...ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు.