
విద్యుత్ కాంతులతో ఆలయం
దేవీశరన్నవరాత్రి మహోత్సవాలకు పెద్దమ్మతల్లి ఆలయం ముస్తాబైంది. మండల పరిధిలోని కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శనివారం నుంచి 11వ తేదీ వరకు దేవీశరన్నవరాత్రి మహోత్సవాలను నిర్వహించనున్నారు.
- నేటి నుంచి 11 వరకు దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు
పాల్వంచ రూరల్ : దేవీశరన్నవరాత్రి మహోత్సవాలకు పెద్దమ్మతల్లి ఆలయం ముస్తాబైంది. మండల పరిధిలోని కేశవాపురం, జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శనివారం నుంచి 11వ తేదీ వరకు దేవీశరన్నవరాత్రి మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి రంగులు వేసి సందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో అలకంరించడంతో రాత్రి సమయంలో కాంతులతో ఆలయం శోభిల్లుతోంది. పది రోజలపాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనం ఇస్తారు. శనివారం 9.30 గంటలకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, అఖండదీపారాధన, దీక్షధారణ, ఎమ్మెల్యే జలగం వెంకట్రావు దంపతులతో కలశపూజలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాస్ తెలిపారు. 8వ తేదీన సరస్వతి పూజలు, 9న దుర్గాష్టమి, 10న మహర్ణనమి, 11న విజయదశమి పూజలు నిర్వహించనున్నట్లు వివరించారు.