ప్రతిభా పురస్కారాలకు 306 మంది ఎంపిక | 306 elect for talent prize | Sakshi
Sakshi News home page

ప్రతిభా పురస్కారాలకు 306 మంది ఎంపిక

Oct 6 2016 1:21 AM | Updated on Sep 4 2017 4:17 PM

పదవ తరగతి మార్చి 2016లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మండలానికి 6 మంది చొప్పున 306 మందిని ప్రతిభా పురస్కారాలకు ప్రభుత్వం ఎంపిక చేసినట్లు డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి తెలిపారు.

కడప ఎడ్యుకేషన్‌: పదవ తరగతి మార్చి 2016లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మండలానికి 6 మంది చొప్పున 306 మందిని ప్రతిభా పురస్కారాలకు ప్రభుత్వం ఎంపిక చేసినట్లు డీఈఓ బండ్లపల్లె ప్రతాప్‌రెడ్డి తెలిపారు. సంబంధిత విద్యార్థులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మానవ వనరుల అభివద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుల చేతుల మీదుగా ఈనెల 15వ తేదీ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ గ్రౌండ్‌లో అందజే యనున్నారు. ప్రతిభా పురస్కారాల జాబితాలో పేర్లు ఉన్న విద్యార్థులందరూ తల్లి లేదా తండ్రి లేదా సంరక్షుడితో హాజరుకావాలని సూచించారు. ప్రతిభా పురస్కారం కింద ఒక మెడల్, ధ్రువీకరణ పత్రంలోపాటు 20 వేల నగదు బహుమతిని  విదార్థుల బ్యాంకు ఖాతాలో జమచేయనున్నట్లు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement