
2లక్షల73వేల మొక్కలు నాటాం : డీఈఓ
హరితహారం కార్యక్రమంలో విద్యా శాఖ అధ్వర్యంలో జిలాల్లో 2లక్షల 66 వేల మొక్కలు నాటవలసి ఉండగా ప్రస్తుతానికి 2లక్షల 73 వేల 4వందల మొక్కలు నాటినాట్లు డీఈఓ చంద్రమోహన్ తెలిపారు.
నార్కట్‌పల్లి: హరితహారం కార్యక్రమంలో విద్యా శాఖ అధ్వర్యంలో జిలాల్లో 2లక్షల 66 వేల మొక్కలు నాటవలసి ఉండగా ప్రస్తుతానికి 2లక్షల 73 వేల 4వందల మొక్కలు నాటినాట్లు డీఈఓ చంద్రమోహన్ తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గురువారం మండలంలోని చిన్ననారయణపురం గ్రామంలోని ప్రా«థమిక పాఠశాలలో మొక్కలు నాటి మాట్లాడారు. వీరి వెంట ఎంపీపీ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, జెడ్పీటీసీ దూదిమెట్ల సత్తయ్య, ఎంపీడీఓ గుర్రం సురేశ్, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎపీఓ వెంకటేశం, సర్పంచ్ రాములు, ఉప సర్పంచ్ లింగయ్యలున్నారు,