కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి గురువారం రాత్రి వరకు ఆన్‌లైన్ ద్వారా మొత్తం 1282 అప్పీళ్లు అందాయి. వీటిలో కొత్తగా ఏర్పడబోయే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు, మండలాలకు సంబంధించిన అభ్యంతరాలు, సూచనలు ఉన్నాయి.
జిల్లాల ఏర్పాటుపై 1282 అప్పీళ్లు
Aug 27 2016 11:35 PM | Updated on Sep 4 2017 11:10 AM
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు సంబంధించి గురువారం రాత్రి వరకు ఆన్‌లైన్ ద్వారా మొ త్తం 1282 అప్పీళ్లు అందాయి. వీటిలో కొత్తగా ఏర్పడబోయే జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు, మండలాలకు సంబంధించిన అభ్యంతరాలు, సూచనలు ఉన్నాయి. కొత్తజిల్లాలకు సంబంధిం చి అప్పీళ్లను పౌరులు నేరుగా ఆన్‌లైన్ ద్వారా కూడా ఫైల్ చేయవచ్చు. ఈ విధానం సులభతరంగా ఉండేలా వెబ్‌సైట్‌లో సౌకర్యం కల్పించారు. ఇందు కోసం www.newdistricts formation.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి వివరాలు అందజేయాలి. చేతిరాతతో రాసిన కాగి తం కానీ, డీటీపీ ద్వారా తయారు చేసి న డాక్యుమెంట్ స్కాన్ చేసి అభిప్రాయం వెబ్‌సైట్‌లో ఆటాచ్ చేసే అవకాశం ఉంటుంది. అప్పీల్ ఫైల్ అయినట్లు దరఖాస్తుదారు సెల్‌కు సమాచారం వస్తుంది.
Advertisement
Advertisement