అట్లాంటాలో బతుకమ్మ సంబరాలు | Atlanta celebrating Bathukamma | Sakshi
Sakshi News home page

అట్లాంటాలో బతుకమ్మ సంబరాలు

Oct 15 2015 7:52 PM | Updated on Jul 6 2019 12:42 PM

అట్లాంటాలో బతుకమ్మ సంబరాలు - Sakshi

అట్లాంటాలో బతుకమ్మ సంబరాలు

అట్లాంటాలో బతుకమ్మ, దసరా సంబరాలు అట్టహాసంగా జరిగాయి.

అట్లాంటాలో బతుకమ్మ, దసరా సంబరాలు అట్టహాసంగా జరిగాయి. తెలంగాణ అభివృద్ధి ఫోరం(టీడీఎఫ్) ఆద్వర్యంలో జరిగిన సంబరాల్లో వందలాది మంది తెలంగాణ మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలను తెచ్చి.. ఆటపాటలో వేడుక చేసుకున్నారు. మునుపెన్నడూ లేనంతగా.. సుమారు 1600 మంది మహిళలు బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో తెలంగాణ గాయకులు స్వర్ణక్క, స్వరూప, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

బతుమ్మ సంబరాల అనంతరం దసరా నేపథ్యంలో శమీ పూజ నిర్వహించారు. బతుకమ్మను అందంగా రూపొందించిన మహిళలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో టీడీఎఫ్ అధ్యక్షుడు విష్ణు కలవల, ట్రస్టీలు కవిత చల్లా, విజయ్ పిట్టా, మురళి చింతలపాని, నవీన్ మామిడిపల్లి, పవన్ కొండెం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement