ప్రేమించి మోసం చేశాడని యువతి..

ప్రియుడు సత్తుపల్లి బెటాలియన్ కానిస్టేబుల్‌గా ఆరోపణ
మధిర : రెండు సంవత్సరాల పాటు ప్రేమించి..పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇప్పుడు మోసం చేశాడని ఆరోపిస్తూ ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన బుధవారం నాగవరప్పాడు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నాగవరప్పాడు గ్రామానికి చెందిన బీమనబోయిన గోపాలకృష్ణ సత్తుపల్లి 16వ బెటాలియన్‌లో తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఇదే గ్రామానికిచెందిన పిన్నెబోయిన రమాదేవి అనే యువతి టీటీసీ పూర్తి చేసింది. ప్రస్తుతం మధిరలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. వీరిద్దరూ సుమారు రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారని, తరచూ సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటారని, పెళ్లి చేసుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.
అయితే గోపాలకృష్ణ ఇటీవల వేరే అమ్మాయిని పెళ్లిచేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న రమాదేవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బుధవారం పురుగులమందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను మధిరలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతోంది. ఈ సంఘటనపై మధిర రూరల్ ఎస్‌ఐ లవణ్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి