ఇద్దరు మహిళా దొంగల అరెస్ట్‌

Women Thievs Arrest in Warangal - Sakshi

నిందితులపై వరంగల్‌తో పాటు ఏపీలోని పలు

నగరాల్లో కేసులు

వరంగల్‌ క్రైం: ఆటోల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళలను లక్ష్యంగా చేసుకోని బ్యాగుల్లోని బంగారు ఆభరణాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ డేవిడ్‌రాజ్‌ తెలిపారు. వారి నుంచి 30 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సీసీఎస్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఆం«ధ్రప్రదేశ్‌ రాష్త్రం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన గండికోటి నూకాలమ్మ అలియాస్‌ ఉయ్యాల కుమారి, ఉయ్యాల మరియమ్మ అలియాస్‌ బుజ్జిలు స్నేహితులు. జల్సాగా బతకాలను ఆలోచనతో వారు దొంగతనాలకు అలవాటుపడ్డారు. ఈ మేరకు వారు ఇద్దరు మరొక మహిళ కడమ్మతో కలిసి దొంగతనాలు చేశారు. 

2013 నుంచి 2017 వరకు విజయవాడ, గుంటూరుల్లో బంగారు ఆభరణాల చోరీకి పాల్పడ్డారు. 2017లో పోలీసులకు దొరకడంతో ఒక సారి జైలుకు కూడా వెళ్లారు. వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో ఈ నెల 1న ఆటోలో ప్రయాణిస్తున్న ఖమ్మం ప్రాంతానికి చెందిన తంగిళపల్లి కరుణ బ్యాగులో బంగారు ఆభరణాలను వారు చోరీ చేశారు. వరంగల్‌ రైల్వే స్టేషన్, బస్టాండ్‌ ప్రాంతాల్లో నిందితులు తిరగుతున్నట్లు వరంగల్‌ ఏసీపీ నర్సయ్యకు సమాచారం రావడంతో ఇద్దరు మహిళలను అధుపులోకి తీసుకున్నారు. వారు నేరాన్ని అంగీకరించారు. దీంతో మరియమ్మ, నూకలమ్మలను అరెస్ట్‌ చేశారు. కడమ్మ పరారీలో ఉంది. నిందితులను సకాలంలో గుర్తించిన ఏసీపీ నర్సయ్య, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ డేవిడ్‌రాజ్, ఇంతెజార్‌గంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్, ఎస్సై అశోక్‌కుమార్, సీసీఎస్‌ ఏఎస్సై ఫర్వీన్, హెడ్‌కానిస్టేబుళ్లు రవికుమార్, జంపయ్య, కానిస్టేబుళ్లు మహ్మద్‌అలీ, రవీందర్‌రెడ్డి, మీర్‌ మహ్మద్‌ అలీ, సంతోష్, నరేష్, రాంరెడ్డి, కుమారస్వామి, మహిళ కానిస్టేబుల్‌ కవితను వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌ అభినందించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top