సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య | Woman Software Engineer Commits Suicide In Uppal | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

May 19 2020 8:31 AM | Updated on May 19 2020 8:42 AM

Woman Software Engineer Commits Suicide In Uppal - Sakshi

 సాక్షి,  ఉప్పల్ ‌: అత్తింటి వేధింపులు భరించలేక సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య చేసుకుంది.  ఉప్పల్‌ పోలీసు స్టేషన్‌పరిధిలో సోమవారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. కల్యాణ్‌పురి టీచర్స్‌ కాలనీకి చెందిన ప్రైవేటు ఉద్యోగి సతీష్‌ వివాహం ఎనిమిది సంవత్సరాల క్రితం పి. శ్రీలత(33)తో  జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల బాబు ఉన్నాడు. శ్రీలత ఉప్పల్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తుంది. (అప్పుడు పెద్ద పండగలా ఉంటుంది)

కొంత కాలంగా శ్రీలత భర్త సతీష్‌ ఉద్యోగం మానేసి జులాయిగా తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో భార్యను మానసికంగా వేధించాడు. భర్తతో పాటు కుటుంబ సభ్యులు సూటిపోటి మాటలతో వేధిస్తున్నారని వారి వేధింపులు తాళలేక సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తమ కూతురు ఆత్మహత్యకు కారణం అత్తింటి వేధింపులేనని ఉప్పల్‌ పీఎస్‌లో మృతురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (గండిపేట గుట్టల్లో అమెరికా సైక్లిస్ట్‌ మృతి)

Advertisement
 
Advertisement
Advertisement