భర్తతో గొడవ.. కూతురితో సహా ఓ వివాహిత..

Woman Jumps From Building With Child Over Quarrel With Husband - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్తతో గొడవ పడి ఓ వివాహిత కూతురితో సహా బిల్డింగ్‌పై నుంచి కిందకు దూకింది. వివరాల్లోకి వెళితే.. బాలాజీనగర్‌కు చెందిన పద్మజకు ఓ ఫంక్షన్‌ వెళ్లే విషయంలో భర్తతో గొడవ చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె రెండు సంవత్సరాల తన పాపతో సహా బిల్డింగ్‌పై నుంచి కిందకు దూకింది. ఈ ఘటనలో పద్మజ అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రగాయాలపాలైన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. పాప పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top