పార్కు చేసి ఉన్న కారును పదే పదే ఢీకొట్టి.. | Woman Driver Hits Parked Car After Driving Away In Pune | Sakshi
Sakshi News home page

పార్కు చేసి ఉన్న కారును ఢీకొట్టిన మహిళ

Aug 21 2019 8:19 PM | Updated on Aug 21 2019 9:02 PM

Woman Driver Hits Parked Car After Driving Away In Pune - Sakshi

ముంబై: పార్కు చేసి ఉన్న టాటా ఇండికా కారును ఓ మహిళా డ్రైవర్‌ తన కారుతో పదే పదే ఢీకొట్టారు. దీంతో టాటా ఇండికా ముందు భాగం ధ్వంసమైంది. ఈ ఘటన పుణెలోని రామనగరలో చోటు చేసుకుంది. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెపై కేసు నమోదు చేసినట్లు పింప్రి- చించావడ్‌ అడిషనల్‌ సీపీ తెలిపారు. తన కారును వెనక్కి తీసే క్రమంలో సదరు మహిళా డ్రైవర్‌ ఐదుసార్లు కారును ఢీకొట్టారని పేర్కొన్నారు. ఈ క్రమంలో పార్కు చేసి ఉన్న కారు అద్దాలు ధ్వంసమైనా ఇవేమీ పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారని వెల్లడించారు. ఇదంతా అక్కడున్న సీసీటీవీలో రికార్డు అయిందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement