రజనీ అభిమానులకు కత్తిపోట్లు | vijay fans atack on rajinikanth fans in anna nagar | Sakshi
Sakshi News home page

రజనీ అభిమానులకు కత్తిపోట్లు

Jan 17 2018 6:22 AM | Updated on Aug 20 2018 4:30 PM

vijay fans atack on rajinikanth fans in anna nagar - Sakshi

అన్నానగర్‌: రజనీ అభిమానులను కత్తితో పొడిచిన ముగ్గురు విజయ్‌ అభిమానులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. ఈరోడ్‌  జిల్లా గోపిషెట్టిపాళయమ్‌ సమీపంలో ఉన్న పారియూర్‌ కొండత్తు కాళియమ్మన్‌ ఆలయంలో ఆదివారం ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా నంజకౌంటన్‌ పాళయమ్‌లో రజనీ అభిమానుల తరఫున ఫ్లెక్సీ పెట్టారు. అదే ప్రాంతానికి చెందిన విజయ్‌ అభిమానులు రత్నవేల్‌(27),  ఇతని తమ్ము డు త్యాగు(25), సతీష్‌ (27) ముగ్గురు కలిసి రజనీ అభిమానులు జగదీషన్‌ (44), పళనిస్వామి (45)తో బ్యానర్‌ విషయంలో వాగ్వాదం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణలో సతీష్, రత్నవేల్, త్యాగు వీరు రజనీ అభిమానులు కట్టిన ఫ్లెక్సీని కాల్చివేసి, జగదీషన్, పళణిస్వామిపై కత్తితో దాడి చేశారు. వారి ఫిర్యాదు మేరకు, గోపిషెట్టి పాళయం పోలీసులు విజయ్‌ అభిమానులు రత్నవేల్, సతీష్, త్యాగును అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరచి జైల్లో ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement