విషవాయువులతో ఇద్దరు కార్మికులు మృతి | two labour died with chemicals | Sakshi
Sakshi News home page

Dec 18 2017 8:02 PM | Updated on Sep 4 2018 5:32 PM

two labour died with chemicals - Sakshi

హైదరాబాద్‌: బాలానగర్‌లోని బయోకెమికల్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో విషాదం చోటుచేసుకుంది. విషవాయువు కారణంగా ఇద్దరు కార్మికులు మృతిచెందారు. కంపెనీలోని డ్రైనేజీని శుభ్రం చేయడానికి మ్యాన్‌హోల్‌లోకి ముగ్గురు కార్మికులు దిగారు. అయితే అందులోని విషవాయువుల కారణంగా ఇద్దరు కార్మికులు మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.  అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. మృతులను మూసాపేట్‌ జనతానగర్‌కు చెందిన అల్లాడి రామారావు(50), అల్లాడి సీతారామ్‌(30) (బాబాయ్‌, అబ్బాయ్‌)గా గుర్తించారు.  

Advertisement
 
Advertisement
Advertisement