పెళ్లయిన మూడు నెలలకే నూరేళ్లు

Three Months Pregnet Woman Suspicious death In Visakhapatnam - Sakshi

అనుమానాస్పదస్థితిలో మూడు నెలల గర్భిణి మృతి  

హత్య చేశారని భర్తింటివారిపై ఆరోపణలు

విశాఖపట్నం, అచ్యుతాపురం(యలమంచిలి): ప్రేమించి పెళ్లిచేసుకుంది... మూడునెలలు గడవలేదు... పెళ్లి పందెరను ఇంకా తీయలేదు... అప్పుడే ఆమెకు నూరేళ్లూ నిండాయి. లక్షరూపాయల కట్నం ఇవ్వలేదని, భూమి రాయలేదని, నీవు కాలుపెట్టి మానాన్నని చంపేశావు అంటూ ఇంటిల్లిపాదీ వేధించారు. చివరకు ఆమెను బలితీసుకున్నారు. ఎం.జగన్నాథపురంలో మూడు నెలల గర్భిణి అనుమానాస్పద మృతి గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పోలీసుల అందించిన వివరాలిలా ఉన్నాయి. ఎం.జగన్నాథపురానికి    చెందిన కండిపల్లి చిరంజీవికి  నర్సీపట్నం వద్ద జబ్బాడకు చెందిన లక్ష్మిని ఈ ఏడాది మే1న ప్రేమ వివాహం చేసుకున్నాడు.   రూ.3 లక్షల కట్నం ఇవ్వాలని చిరంజీవి కుటుంబం కోరింది. పెళ్లి సమయంలో రూ.రెండులక్షల కట్నం ఇచ్చారు. రూ.లక్ష ఇవ్వాల్సి ఉంది.  అత్త నూకరత్నం,  భర్త మేనత్త  అత్త మారమ్మ కట్నంవిషమై వేధిస్తూ వచ్చారు. మంగళవారం ఉదయం చిరంజీవి లక్ష్మిని కొట్టి గాయపరిచాడు. రాత్రి 9గంటల సమయంలో లక్ష్మి శ్లాబ్‌ కొక్కానికి  చీరతో ఉరివేసుకొని చనిపోయింది.   మనస్తాపంతో లక్ష్మి  ఆత్మహత్యచేసుకుందని భర్త చిరంజీవి చెబుతున్నాడు.   సీఐ విజయనాథ్‌సంఘటన స్థలానికి చేరకుని, మృతదేహాన్ని అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించారు.

మామను తీసేసిందని ఆరోపణలు  
లక్ష్మి మేనత్త మణిని, చిరంజీవి అన్నశ్రీను పెళ్లిచేసుకున్నాడు. ఆ పెళ్లిలోనే చిరంజీవికి లక్ష్మితో పరిచయం ఏర్పడి, ప్రేమచిగురించింది. వరసుకుదరడంలేదని పెళ్లికి చిరంజీవి కుటుంబసభ్యులు నిరాకరించారు. లక్ష్మి మొండికేయడంతో ఎట్టకేలకు పెళ్లికి అంగీకరించారు. పెళ్లి జరిగిననాటినుంచి అత్త నూకరత్నం, చిరంజీవి మేనత్త మారమ్మలు చిరంజీవిని  వేధిస్తూ వచ్చారు. 20 రోజుల క్రితం చిరంజీవి తండ్రి ఎర్రయ్య పాముకాటుకు గురై చనిపోయాడు. లక్ష్మి అడుపెట్టి మామను పొట్టన పెట్టుకుందని చిరంజీవి కుటుంబసభ్యులు నిందించిండం మొదలుపెట్టారు.

విమర్శలు రావడంతో...
లక్ష్మి మేనత్తను చిరంజీవి అన్న చేసుకున్నాడు. మేనత్త మేనకోడళ్లు తోటికోడళ్లుగా వచ్చారు.  గ్రామంలో ఇదో చర్చనీయాంశం అయ్యింది. గ్రామంలో వచ్చిన విమర్శలతో చిరంజీవి అంటీముట్టనట్టు ఉండడం మొదలుపెట్టాడు. పెళ్లికి ముందు తనపై చూపిన ప్రేమచూపడం లేదని లక్ష్మి గొడవపడేది, ఇస్తామన్న కట్నం ఇవ్వలేదని  చిరంజీవి గొడవపడుతూవచ్చాడు. తాను చెప్పినట్టే నడుచుకోవాలని లక్ష్మిని కొట్టేవాడు.ఇదే విషయాన్ని చిరంజీవి అన్న శ్రీను పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు.   మంగళవారం ఉదయం తనను నిందించడంపై లక్ష్మి ప్రతిఘటించింది. వేరే కాపురానికి వెళ్లిపోదామని చిరంజీవితో వాదనకు దిగింది. దీంతో చిరంజీవి  పశువును కొట్టినట్టు కర్రతో కొట్టాడు. లక్ష్మి శరీరంపై  గాయాలు ఏర్పడ్డాయి.   రాత్రి 8గంటల సమయంలో లక్ష్మిభోజనానికి రాలేదు. తలుపు తట్టిచూస్తే గడియవేసి ఉంది. కిటీలోనుంచి చూస్తే లక్ష్మి ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. చింజీవి, తన అన్న శ్రీను లక్ష్మిని కిందకి దించారు. అప్పటికే లక్ష్మి చనిపోయింది. మనస్తాపంతో  లక్ష్మి ఆత్మహత్యచేసుకుందని భర్త చిరంజీవి చెప్పాడు.

చంపేశారు...
 తన కుమార్తె ఆత్మహత్యచేసుకునే పిరికిది కాదని లక్ష్మి తల్లి పెదలక్ష్మి ఆవేదన వ్యక్తంచేసింది. కట్నం బకాయి లక్షరూపాయలు 50 సెంట్ల భూమి రాయలేదని తన కుమార్తెను పొట్టన పెట్టుకున్నారని ఆమె కన్నీరుమున్నీరైంది. భర్త చిరంజీవి, అత్త నూకరత్నం, భర్త మేనత్త మారమ్మ,బావ శ్రీనులు తన  కుమార్తెను హత్యచేశారని  లక్ష్మి తండ్రి ధర్మరాజు పోలీసులకు ఫిర్యాదుచేశారు. డీఎస్పీ కె.వి.రమణ అనకాపల్లి ఏరియా ఆస్పత్రిలో శవపరీక్ష చేసారు. కేసునమోదుచేసినట్టు ఎస్‌ఐ తారకేశ్వరరావు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top