
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నాగర్ కర్నూల్ : పెళ్లింట్లో విషాదం చోటుచేసుకుంది. అంతా పెళ్లి పనుల్లో హడావుడిలో ఉండగా 25 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. పెళ్లికి హాజరైన బంధువుల నగలు అపహరణకు గురవ్వడంతో పెళ్లి కొడుకు తండ్రి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర మనస్తాపం చెందాడు. గ్రామస్తులు, పెళ్లికి వచ్చిన బంధులందరి ముందూ తన కుటుంబం పరువు పోయిందనే అవమాన భారంతో వ్యవసాయ పొలం వద్ద శనివారం ఉదయం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తిమ్మాజిపేట మండలం కోడుపర్తిలో జరిగింది. శ్రీనివాస్ రెడ్డి మృతితో భయపడిపోయిన దుండగులు దొంగిలించిన నగలను మృతుడి ఇంటి సమీపంలో పడేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టామని వెల్లడించారు.