దారి కాచి.. దాడి చేసి.. | TDP Activists Attack On Kotayya | Sakshi
Sakshi News home page

దారి కాచి.. దాడి చేసి..

Apr 4 2018 11:47 AM | Updated on Apr 3 2019 8:52 PM

TDP Activists Attack On Kotayya - Sakshi

దాడిలో గాయపడిన కోటయ్య

ఒంగోలు క్రైం: కొత్తపట్నం మండలం అల్లూరుకు చెందిన రాతికింది కోటయ్యపై చింతలకు చెందిన కొందరు టీడీపీ నాయకులు మంగళవారం సాయంత్రం దారికాచి దాడిచేసి తీవ్రంగా కొట్టారు. టాటా ఏస్‌ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాతికింద కోటయ్య ఒంగోలులో పనులు ముగించుకొని తన ద్విచక్ర వాహనంపై అల్లూరుకు వెళుతున్నాడు. ద్విచక్ర వాహనంపై కొప్పోలు దాటిన తరువాత విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపానికి వెళ్లే సరికి వెనుక నుంచి అల్లూరు శివారు గ్రామమైన చింతలకు చెందిన సుధాకర్‌ అనే వ్యక్తి బండి ఆపమని కేకలు వేశాడు. దీంతో వాహనాన్ని ఆపడంతో మరో నాలుగు ద్విచక్ర వాహనాల్లో మరికొంత మంది వచ్చి  బలవంతంగా తనను తన బండికే కట్టేసి ఈడ్చుకుంటూ సమీపంలోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు.

పంచాయతీ సమావేశం సందర్భంగా టీడీపీ నాయకులను ఎదురిస్తావా అంటూ దుర్భాషలాడుతూ తీవ్రంగా దాడి చేశారు. దీంతో స్పృహ కోల్పోడంతో అటుగా వెళుతున్న పశువుల కాపరులు 108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు. ఈ మేరకు రిమ్స్‌ అవుట్‌ పోస్ట్‌ పోలీసులు కోటయ్య వద్ద సమాచారాన్ని తీసుకొని ఒంగోలు తాలూకా పోలీసులకు పంపించారు. సమాచారం తెలుసుకున్న కోటయ్య కుటుంబ సభ్యులు, కొత్తపట్నం మండలం, అల్లూరు గ్రామానికి చెందిన వైఎస్సార్‌ సీపీ నాయకులు   కోటయ్యను పరామర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement