గురుగ్రామ్‌లో స్పానిష్‌ యువతిపై అత్యాచారం

Spanish intern Molested in Gurgaon - Sakshi

గురుగ్రామ్‌: ఢిల్లీకి చెందిన ఫిల్మ్‌ మేకర్‌ తనపై అత్యాచారం జరిపాడని 23 ఏళ్ల స్పానిష్‌ యువతి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన స్పానిష్‌ యువతి భారత్‌లోని ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో ఏడాది పాటు ఇంటెర్న్‌గా పనిచేయడానికి ఇక్కడికి వచ్చింది. గురుగ్రామ్‌లో బస చేసిన ఆమె.. ఇల్లు మారాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ ద్వారా నిందితుడు ఆంజనేయ్‌ ఆమెకు పరిచయమయ్యాడు. యానిమేషన్‌ చిత్రాలు నిర్మించే ప్రొడక్షన్‌ హౌస్‌లో పనిచేస్తున్న అతని స్వస్థలం ఢిల్లీలోని ఆనంద్‌ విహార్‌ కాగా.. ప్రస్తుతం గురుగ్రామ్‌లో ఉంటున్నాడు. 

అతను శుక్రవారం (జూన్‌ 14) పార్టీ ఉందని తన ఇంటికి పిలిచాడు. దీంతో రాత్రి 10.30 గంటల సమయంలో స్పానిష్‌ యువతి అతనికి ఇంటికి వెళ్లింది. ‘నేను అతన్ని గట్టిగా నమ్మడంతోనే అతని ఇంటికి వెళ్లాను. కొన్ని గంటలు కలిసి గడిపాక మేం ముద్దులు పెట్టుకున్నాం. ఆ తర్వాత పైన ఉన్న గదిలోకి నన్ను అతను తీసుకెళ్లాడు. అయితే, శృంగారంలో పాల్గొనాలన్న ఆలోచన నన్ను ఇబ్బంది పెట్టింది. అది వద్దని నేను అతనికి చెప్పను. దీంతో కనీసం రాత్రి ఇక్కడే గడిపి వెళ్లు అతని చెప్పాడు. ఇందుకు అంగీకరించాను. కానీ, నిద్రపోయిన తర్వాత కొంతసేపటికి మేలుకువ వచ్చింది. ఆంజనేయ్‌ హస్తప్రయోగం చేసుకుంటూ నావైపు చూస్తూ కనిపించాడు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. వెంటనే ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను. కానీ అతను నన్ను వెళ్లనివ్వలేదు. నాకు ఇబ్బందిగా ఉందని ఎంత చెప్పినా వినిపించుకోకుండా అతన్ను బలవంతపెట్టాడు. బలత్కారం చేశాడు. అతను చెప్పినట్టు చేయకుంటే ఇంకేదైనా దారుణం చేస్తాడేమోనన్న భయంతో ఈ ఘోరాన్ని నేను భరించాను. డోర్లు మూసి..నా ఫోన్‌ విసిరేసి..అతను నాపై అత్యాచారం చేశాడు’ అని బాధితురాలు ఫిర్యాదులో వివరించారు. తన స్నేహితురాలి ద్వారా ఆ ఘటన జరిగిన మరునాడే బాధితురాలు ఫిర్యాదు చేసింది. మొదట ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేసిన బాధితురాలు అనంతరం పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. నిందితుడు ఆంజనేయ్‌పై ఐపీసీ సెక్షన్లు 376 (రేప్‌), 342 (అక్రమ నిర్బంధం) కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top