
బస్సు ఢీకొన్న సంఘటనలో మృతి చెందిన పల్లపు వెంకటరమణ, కుంచపు వెంకటరమణ
రాయచోటిటౌన్ : బైకును ఆర్టీసీ బస్సు ఢీకొన్న సం ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. మంగళవారం రాత్రి పట్టణ పరిధిలోని పొదలపల్లెకు చెందిన పల్లపు వెంకట్రమణ, కుంచపు వెంకట్రమణలు బైకుపై రాయచోటి పట్టణానికి వచ్చారు. పనులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో గాలివీడు రోడ్డులోని పెట్రోల్ బంక్ సమీపానికి వెళ్లగానే మదనపల్లె డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రాయచోటి బస్టాండ్‌కు వచ్చి తిరిగి కడప వైపు వెళ్లే సమయంలో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో మృతి చెందాడు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.