మసాజ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం | Prostitution Scandal in Massage Centre Hyderabad | Sakshi
Sakshi News home page

మసాజ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం

Feb 22 2019 9:21 AM | Updated on Feb 22 2019 9:21 AM

Prostitution Scandal in Massage Centre Hyderabad - Sakshi

అడ్డగుట్ట: మసాజ్‌ సెంటర్‌ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాకు తుకారాంగేట్‌ పోలీసులు చెక్‌ పెట్టారు. నిర్వాహకులతో పాటు ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈస్ట్‌ మారేడుపల్లిలోని రాజేష్‌ కుమార్‌ అనే వ్యక్తి ‘ట్రాంక్విల్‌ యూని సెక్స్‌ సెలూన్‌ అండ్‌ స్పా’ పేరుతో  మసాజ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. మన్నపు శ్రావన్‌కుమార్, ఎల్క విద్యా సాగర్‌తో కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో బుధవారం రాత్రి తుకారాంగేట్‌ పోలీసులు దాడులు నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రావణ్‌కుమార్, విద్యాసాగర్, విటులు విద్యానగర్‌కు చెందిన పులుగుర్త సురేష్, నాచారం ప్రాంతానికి చెందిన మేడల రాజ్‌ కుమార్‌తో పాటు ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు యువతులను బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌కు  తరలించారు. వారి నుంచి 8 సెల్‌ ఫోన్లు, రూ. 13,040 నగదు స్వాధీనం చేసుకొని గురువారం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement