దుస్తులు విప్పితేనే.. యాక్టింగ్‌.. నిందితుడు అరెస్ట్‌!

Police Arrest Sutradhar Head vinay Varma - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నటన నేర్పిస్తానంటూ యువతులపై వేధింపులకు దిగిన ‘సూత్రధార్‌’ నిర్వాహకుడు వినయ్‌ వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వినయ్‌ వర్మపై నిర్భయ కేసు నమోదు చేశారు. నటన నేర్చుకోవాలంటే అర్థనగ్నంగా నిలబడాలంటూ యువతులను  వినయ్‌ వర్మ వేధించాడు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో వినయ్‌ వర్మ వేధింపులకు వెలుగులోకి వచ్చాయి.  వినయ్‌ వర్మపై సెక్షన్‌ 354 ఏ, ఐపీసీ 506, 509  కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  నిందితుడిని పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

దుస్తులు విప్పితేనే.. యాక్టింగ్‌ నేర్పిస్తా
యాక్టింగ్‌ నేర్పిస్తానని, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని.. అందుకు ‘అన్ని విధాలుగా’సిద్ధంగా ఉండాలని ఓ యువతిని వినయ్‌ వర్మ వేధించాడు. కవాడిగూడకు చెందిన అచ్నిత్‌ కౌర్‌కు యాక్టింగ్‌ అంటే ఇష్టం. నటనలో శిక్షణ పొందేందుకు హిమాయత్‌నగర్‌లోని ‘సూత్రధార్‌’ఇనిస్టిట్యూట్‌లో కొద్ది రోజుల క్రితం చేరింది. ఆ సంస్థ నిర్వాహకుడు వినయ్‌వర్మ 20 ఏళ్లుగా నటనలో శిక్షణ ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న యువతులను లైన్‌లో నిలబెట్టి అందరూ దుస్తులు విప్పాలని వినయ్‌ ఆదేశించాడు. దీనికి అచ్నిత్‌ కౌర్‌ నిరాకరించింది. దుస్తులు విప్పితేనే యాక్టింగ్‌ నేర్పిస్తానంటూ అతను అసభ్యకరంగా మాట్లాడాడు. ఇలాంటి యాక్టింగ్‌ శిక్షణ తనకు అవసరం లేదంటూ ఆమె ఇనిస్టిట్యూట్‌ నుంచి బయటకు వచ్చి షీ టీమ్‌ను ఆశ్రయించింది.

చదవండి: దుస్తులు విప్పితేనే.. యాక్టింగ్‌ నేర్పిస్తా

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top