రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | one died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Feb 28 2018 8:44 AM | Updated on Aug 30 2018 4:20 PM

one died in road accident - Sakshi

ప్రమాదంలో మృతిచెందిన జ్ఞానేశ్వర్‌

ఉట్నూర్‌ రూరల్‌: మండలంలోని పులిమడుగు గ్రామ సమీపంలో సోమవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో హస్నాపూర్‌ పంచాయతీ పరిధి దేవుగూడ గ్రామానికి చెందిన మడావి జ్ఞానేశ్వర్‌ (21)అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానిక ఎస్సై సాయన్న తెలిపిన వివరాల ప్రకారం.. జ్ఞానేశ్వర్, ఆయన స్నేహితుడు కుమ్ర అశోక్‌ ఇంద్రవెల్లి మండలం కెస్లగూడ గ్రామానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా పులిమడుగు వద్ద వాహనం అదుపుతప్పి కింద పడగా జ్ఞానేశ్వర్‌ అక్కడిక్కడే మృతి చెందాడు.

అశోక్‌కు తీవ్రగాయాలు కాగా 108లో ఉట్నూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.  

మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ 
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జ్ఞానేశ్వర్‌ కుటుంబాన్ని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రూ.5 వేలు ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ రాథోడ్‌ విమల, పలువురు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement