బాలికను తల్లిని చేసిన తాత? | Old Man Molestation on Minor Girl in Jagtial | Sakshi
Sakshi News home page

బాలికను తల్లిని చేసిన తాత?

Aug 18 2019 8:54 AM | Updated on Aug 18 2019 8:57 AM

Old Man Molestation on Minor Girl in Jagtial - Sakshi

వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చిన బాలిక

జగిత్యాలక్రైం:  వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చిన బాలిక(15)ను పక్కింట్లో ఉంటున్న వరుసకు తాత అయిన వృద్ధుడు(65) వంట చేయమని ఇంటికి పిలిచి అత్యాచారం చేశాడు. ప్రస్తుతం బాలిక నాలుగు నెలల గర్భిణి కావడంతో విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. జగిత్యాల జిల్లాకేంద్రంలోని పురాణిపేటకు చెందిన బాలిక ఓ రెసిడెన్షియల్‌ పాఠశాలలో ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. మొన్నటి వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చిన బాలికను పక్కింట్లో ఉంటున్న వరుసకు తాత అయిన వ్యక్తి వంట చేయమని పిలిచి అత్యాచారం చేశాడు.

విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయపడిన బాలిక గోప్యంగా ఉంచింది. విద్యాసంవత్సరం ప్రారంభమై స్కూలుకు వెళ్లిన బాలిక పక్షంరోజుల నుంచి అస్వస్థతతో ఉంటోంది. ఈనెల 12 కడుపునొప్పికి గురికావడంతో పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి బాలికను ఆస్పత్రిలో చూపించారు. పరీక్షించిన వైద్యులు నాలుగునెలల గర్భిణిగా తేల్చారు. బాలికను తల్లిదండ్రులు నిలదీయగా అసలు విషయం బయటపెట్టింది. అయితే అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడే తనపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులుపై ఫిర్యాదు చేశాడు. బాలిక తరఫు నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement