
ప్రతీకాత్మక చిత్రం
కాన్పూర్ : ఓ తల్లి తన ఐదేళ్ల కుమారుడిని కొత్తగా నిర్మించిన భవనం 11వ అంతస్తు నుంచి తోసేసి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్పీ కథనం ప్రకారం...స్థానికంగా నివాసం ఉంటున్న పవన్ అగర్వాల్(37), జయ అగర్వాల్(33) ఇద్దరూ భార్యభర్తలు. వీరికి పార్థ్(7), ఉత్కర్ష్(5) అనే ఇద్దరు కుమారులున్నారు. జయ అగర్వాల్ కొంతకాలంగా తీవ్రమైన స్కిజోఫ్రోనిక్ వ్యాధితో బాధపడుతున్నారు.
అయితే ఆదివారం తీవ్ర ఒత్తిడికి లోనైన జయ అగర్వాల్ మొదట తన చిన్నకుమారుడిని పై నుంచి తోసేసింది. వెంటనే తేరుకున్న జయ భర్త కిందికి వెళ్లి చూడగా కుమారుడు రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు. కాసేపటికే భార్య కూడా పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటనతో ఆ ప్రాంతమంతా విషాదం నెలకొంది. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.