
ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మిం చాడు. అభం శుభం తెలి యని ఏడో తరగతి బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లి దండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో యువకుడిపై కేసు నమోదు చేశారు.
యనమలకుదురు (పెనమలూరు) : యనమలకుదురులో బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు వంచించి లైంగిక దాడికి పాల్పడటంతో పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు.పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. యనమలకుదురు పెద్ద కరకట్ట ప్రార్థనా మందిరం సమీపంలో బాలిక (14) కుటుంబ సభ్యులతో ఉంటోంది. ఆమె 7వ తరగతి చదువుతోంది. ఇంటి సమీపంలో ఉంటున్న ఓ యువకుడు (18) ఆమె వెంటపడి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమెపై లైంగిక దాడి కూడా చేశాడు. పెళ్లి చేసుకోవాలని బాలిక కోరటంతో ముఖం చాటేశాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేశారు.