 
													గుణదల(విజయవాడ): చిన్నారిపై ఓ వృద్ధుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం వెలుగుచూసింది. విజయవాడ నగరంలోని గుణదల వెంకటేశ్వరానగర్‌లో వేల్పుల పిచ్చయ్య(90) కొంత కాలంగా నివాసం ఉంటున్నాడు. గురువారం ఉదయం వృద్ధుడి ఇంటికి సమీపంలో ఐదేళ్ల చిన్నారి పాప ఆడుకుంటోంది.
పాపను దగ్గరకు పిలిచి అసభ్యకరంగా ప్రవరిస్తున్నాడు. బిడ్డ కోసం వెతుకుతున్న పాప తల్లికి వృద్ధుడి లైంగిక వేధింపులు కంటపడ్డాయి. దీంతో ఆమె మాచవరం పోలీసులకు తెలియజేసింది. మాచవరం సీఐ సాహేరా బేగం గురువారం రాత్రి 11 గంటల సమయంలో వెంకటేశ్వరనగర్‌కు వెళ్లి వివరాలు సేకరించారు. చిన్నారిపై వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ కుటుంబసభ్యులు పోలీసుల వద్ద వాపోయారు. వృద్ధుడిపై కేసు నమోదు చేసి శుక్రవారం అరెస్టు చేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
