బాలికను వేధించిన వ్యక్తి రిమాండ్‌ | Man Remanded In harassment case | Sakshi
Sakshi News home page

బాలికను వేధించిన వ్యక్తి రిమాండ్‌

Apr 26 2018 9:20 AM | Updated on Apr 26 2018 9:20 AM

Man Remanded In harassment case - Sakshi

నిందితుడిని చూపుతున్నపోలీసులు

మిరుదొడ్డి(దుబ్బాక) : మైనర్‌ బాలికను పెళ్లిపేరుతో వేధింపులకు గురి చేసిన వ్యక్తిని రిమాండ్‌కు తరలించినట్లు మిరుదొడ్డి ఎస్‌ఐ విజయ్‌ భాస్కర్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ..మండల కేంద్రం మిరుదొడ్డిలో మన్నె శేఖర్‌(28) అనే వివాహితుడు అదే గ్రామానికి చెందిన మైనర్‌ బాలికను పెళ్లి చేసుకుంటానని కొంత కాలంగా వేధిస్తున్నాడు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శేఖర్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement