నయవంచనకు గురైన బాలిక | Man Cheated And Molestation On Girl in Chittoor | Sakshi
Sakshi News home page

నయవంచనకు గురైన బాలిక

Nov 23 2018 10:53 AM | Updated on Nov 23 2018 10:53 AM

Man Cheated And Molestation On Girl in Chittoor - Sakshi

చిత్తూరు, మదనపల్లె క్రైం: ఓ ప్రబుద్దుడు ప్రేమిస్తున్నానని అనాథ బాలిక వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని కోర్కె తీర్చుకున్నా డు. చివరకు మోసం చేశాడు. ఆ యువకుడు విదేశాలకు వెళ్లిపోతున్నట్టు తెలుసుకున్న బాధితురాలు పినతండ్రితో కలిసి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసిం ది. దీంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాలిక పినతండ్రి కథనం మేర కు.. మదనపల్లె పట్టణం సాయిబాబా గుడివీధిలో ఒక బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో పినతల్లి వద్ద ఉంటోంది. ఆమెపై కన్నేసిన పోతులప్పవీధికి చెందిన యువకుడు ఏడాదిగా ప్రేమించినట్లు నటించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మిం చి పలుమార్లు అత్యాచారం చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న బాలిక బంధువులు నిలదీయడంతో ఆ యువకుడి వ్యవహారం బట్టబయలైంది. పెళ్లి చేసుకోవా లని నిలదీయడంతో తనకు సంబంధం లేదంటూ సమాధానం ఇచ్చాడు. బాధితులు టూటౌన్‌ పోలీసులకు నాలుగు నెలల క్రితం ఫిర్యాదు చేశారు. పోలీసుల దగ్గర పంచాయితీ అనంతరం తన ఆర్థిక బలంతో కేసును నీరుగార్చి బాధితురాలిని బెదిరించాడు. చేసేది లేక తల్లిదండ్రులు లేని ఆ బాలిక ఆత్మహత్య చేసుకోవడానికి యత్నిం చింది. ఆ యువకుడిని ఎదిరించే స్థోమతలేక ఆ యువతి కొంతకాలంగా మదనపడుతూ తీవ్ర క్షోభను అనుభవిస్తోంది. విషయం తెలుసుకున్న బాలిక పినతండ్రి టూటౌన్‌ పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరాడు. పోలీసులు కాలయాపన చేయడంతో చేసేది లేక పత్రికా ప్రతినిధులను ఆశ్రయించాడు. తల్లిదండ్రులు లేని బాలికను మోసం చేసి కోర్కె తీర్చుకుని ప్రస్తుతం విదేశాలకు వెళ్లిపోవడానికి సమాయత్తమవుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి బాలిక న్యాయం చేయాలని కోరుతున్నాడు. దీనిపై సీఐ సురేష్‌కుమార్‌ వివరణ ఇస్తూ బాధితులు ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement