భార్యను చిత్రహింసలు పెట్టి.. డ్రైనేజీలో.. | Man Attacked Wife Threw Her In Drainage Nellore District | Sakshi
Sakshi News home page

భార్యను చిత్రహింసలు పెట్టిన భర్త

Published Thu, Feb 20 2020 1:25 PM | Last Updated on Thu, Feb 20 2020 1:49 PM

Man Attacked Wife Threw Her In Drainage Nellore District - Sakshi

సాక్షి, నెల్లూరు: అనుమానంతో కట్టుకున్న భార్యను చిత్రహింసలు పెట్టాడో భర్త. అనంతరం ఆమెను డ్రైనేజీలో పడేశాడు. ఈ అమానుష ఘటన నెల్లూరు జిల్లా కావలిలో చోటుచేసుకుంది. వివరాలు.. షేక్‌ షరీఫ్‌, రమీజా భార్యభర్తలు. కొద్దికాలంగా రమీజాపై అనుమానం పెంచుకున్న షరీఫ్‌ బుధవారం రాత్రి ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఇందుకు అతడి సోదరి కూడా సహకరించింది. అనంతరం ఇద్దరూ కలిసి రమీజాను తమ ఇంటి ముందు ఉన్న డ్రైనేజీలో పడేశారు. ఈ క్రమంలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన రమీజా రాత్రంతా డ్రైనేజీలోనే ఉండిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. ఉదయం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఆమెను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రమీజా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. 

చదవండి: పాడేరు టు తమిళనాడు

వివాహితతో సాన్నిహిత్యం: ఆటోడ్రైవర్‌ దారుణ హత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement