ఆ మహిళ సీటీ స్కాన్‌ కోసం వెళితే.. | Man Arrested For Molesting Woman | Sakshi
Sakshi News home page

ఆ మహిళ సీటీ స్కాన్‌ కోసం వెళితే..

Dec 25 2019 10:49 AM | Updated on Dec 25 2019 10:49 AM

Man Arrested For Molesting Woman - Sakshi

సీటీ స్కాన్‌ కోసం వెళ్లిన మహిళపై టెక్నీషియన్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగుచూసింది.

ముంబై : దిశ, ఉన్నావ్‌ ఘటనలు దేశాన్ని కుదిపేసినా మహిళలు, చిన్నారులపై వేధింపుల పర్వానికి తెరపడలేదు. మహారాష్ట్రలో సీటీ స్కాన్‌ చేయించుకునేందుకు వెళ్లిన 40 సంవత్సరాల మహిళను ఓ మెడికల్‌ అసిస్టెంట్‌ వేధింపులకు గురిచేసిన ఘటన ఉల్లాస్‌నగర్‌లో వెలుగుచూసింది. ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో సీటీ స్కాన్‌ యంత్రాన్ని ఆపరేట్‌ చేసే జేమ్స్‌ థామస్‌(24) సీటీ స్కాన్‌ కోసం వచ్చిన మహిళను అభ్యంతరకరంగా తాకుతూ ఆమె ఫోటోలను తీసుకున్నాడని బాధిత మహిళ ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు జేమ్స్‌ను అదుపులోకి తీసుకున్నామని డిసెంబర్‌ 27వరకూ అతడిని కోర్టు తమ కస్టడీకి అప్పగించిందని వెల్లడించారు. థామస్‌ను విచారిస్తున్న పోలీసులు అతడి మొబైల్‌ ఫోన్‌నూ పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement