బాలికపై లైంగికదాడి యత్నం  | Man Arrested For Alleged Sexual Assault Of 12 Years Girl | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగికదాడి యత్నం 

Jun 8 2018 2:04 PM | Updated on Oct 17 2018 6:10 PM

Man Arrested For Alleged Sexual Assault Of  12 Years Girl - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నిజామాబాద్‌ రూరల్‌ : రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గూపన్‌పల్లి జీపీ పరిధిలో గల గంగాస్థాన్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు మైనర్‌ బాలికపై అత్యాచారయత్నం జరిగింది. వివరాలిలా ఉన్నాయి.

అపార్ట్‌మెంట్‌కు వాటర్‌ బాటిల్స్‌ను సరఫరా చేసే బోర్గాంకు చెందిన శ్రీని వాటర్‌ ప్లాంట్‌ బాయ్‌ వడ్ల గణపురం రంజిత్‌ అనే యువకుడు వాటర్‌ బిల్‌ డబ్బుల కోసం వచ్చి ఇంట్లో తల్లిదండ్రులు లేనిది చూసి అదను చేసుకొని 11ఏళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి తప్పించుకొని కిందికి వెళ్లి అపార్ట్‌మెంటులో ఉండే పెద్దలకు రోదిస్తూ చెప్పింది.

దీంతో నిందితుడిని అపార్ట్‌మెంట్‌వాసులు తాళ్లతో బంధించి, దేహశుద్ధి చేసి 100కు సమాచారం అందించారు. వెంటనే నిజామాబాద్‌ రూరల్‌ సీఐ వెంకటేశ్వర్‌ హుటాహుటిన అక్కడికి చేరుకుని వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే రిమాండ్‌ చేశారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement