
కావలిరూరల్: పెద్దలు పెళ్లికి నిరాకరించండంతో ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. కావలి రూరల్ ఎస్సై జి.పుల్లారావు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక బుడంగుంట కాలనీకి చెందిన నాగమణి, గాయత్రినగర్‌కు చెందిన ఆదిల్‌లు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తుండగా ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తెలిసిన నాగమణి కుటుంబసభ్యులు ఆమెను ఉద్యోగం మాన్పించి ఇంటివద్దనే ఉంచారు.
తనకు వేరే వ్యక్తితో పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నాగమణి ఆదిల్‌కు సమాచారం అందించింది. ఈ క్రమంలో వారు ఆదివారం కావలి డీఎస్పీ కె.రఘును కలిశారు. ఆయన నాగమణి, ఆదిల్ తల్లిదండ్రులతో మాట్లాడాలని రూరల్ ఎస్సైని ఆదేశించారు. దీం తో పుల్లారావు ఇరువురి కుటుంబసభ్యులను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆదిల్ కుటుంబసభ్యులు వివాహానికి అంగీకరించారు. నాగమణి కుటుంబసభ్యులు తమ నిర్ణయం చెప్పకపోవడంతో కొంత సమయం ఇచ్చారు.