తిరుమలలో అమానుషం

Infant Was Deserted In Tirumala - Sakshi

తిరుపతి: తిరుమలలో అమానుష ఘటన శనివారం చోటుచేసుకుంది. ఏడు రోజుల వయసున్న శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. శ్రీవారి ఆలయం ముందున్న కల్యాణకట్ట వద్ద శిశువు ఏడుస్తూ కనిపించడంతో అటుగా వెళ్తున్న భక్తులు, విజిలెన్స్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన సిబ్బంది స్థానికంగా ఉన్న అశ్విని ఆసుపత్రిలో శిశువును చేర్చారు. ఈ ఘటనపై విజిలెన్స్‌ సిబ్బంది, పోలీసులు విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా శిశువును ఎవరు వదిలి వెళ్లారని గుర్తించేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top