breaking news
Deserted
-
వదిలేసిన కారులో రూ. కోటి నగదు
యశవంతపుర (కర్ణాటక): ఖాళీ స్థలంలో వదిలి వెళ్లిన కారులో కోటి రూపాయల నగదు బయట పడిన ఘటన ఉత్తరకన్నడ జిల్లా అంకోలా తాలూకా జాతీయ రహదారి 63లో రామనగుళి వద్ద వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం నుంచి గుర్తు తెలియని కారు నిలిపి ఉంది. అనుమానం పడిన స్థానికులు అంకోలా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు చేరుకుని పరిశీలించారు. బెంగళూరు రిజిస్ట్రేషన్ నంబర్ గల హుండై క్రెటా కారులో కోటి రూపాయిల నగదు లభించింది. కారును, నగదును సీజ్ చేశారు. కారు ఎవరిది, నగదుతో పాటు ఎందుకు వదిలేశారు అనేది సస్పెన్స్‌గా మారింది. కారు నంబరు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. -
తిరుమలలో అమానుషం
తిరుపతి: తిరుమలలో అమానుష ఘటన శనివారం చోటుచేసుకుంది. ఏడు రోజుల వయసున్న శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. శ్రీవారి ఆలయం ముందున్న కల్యాణకట్ట వద్ద శిశువు ఏడుస్తూ కనిపించడంతో అటుగా వెళ్తున్న భక్తులు, విజిలెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన సిబ్బంది స్థానికంగా ఉన్న అశ్విని ఆసుపత్రిలో శిశువును చేర్చారు. ఈ ఘటనపై విజిలెన్స్ సిబ్బంది, పోలీసులు విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా శిశువును ఎవరు వదిలి వెళ్లారని గుర్తించేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. -
వారికి పే టీఎం, షాప్ క్లూస్ మద్దతు
న్యూఢిల్లీ: క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఫ్లిప్‌కార్ట్ నుంచి ఆఫర్ లెటర్లు అందుకుని ఉద్యోగం రాక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు రెండు ఈ కామర్స్ సంస్థలు ముందుకు వచ్చాయి. గుజరాత్ బాధిత విద్యార్థులకు ఐఐఎం పేటీఎమ్, షాప్ క్లూస్ మద్దతు లభించింది. ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్ లెటర్స్ అందుకుని భంగపడి, ఉద్యోగాల కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఐఐఎం గ్రాడ్యుయేట్లకు తమ సంస్థలో ఉద్యోగాలు కల్పించేందుకు యోచిస్తున్నట్టు పేటిఎం ప్రకటించింది. వారికి ఉద్యోగాలిచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేటీఎం వైస్ ప్రెసిడెంట్ అమిత్ సిన్హా తెలిపారు. ఈ మేరకు అహ్మదాబాద్ అధికారులతో మాట్లాడుతున్నామన్నారు. విద్యార్థుల ప్రొఫైల్స్ పంపమని అడిగామనీ, వాటిని పరిశీలించిన మీదట నైపుణ్యానికి తగ్గట్టుగా పోస్టింగ్స్ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఇటీవల జరిగిన ప్లేస్మెంట్లలో పలు ఐఐఎంల నుంచి 50 మందిని విధుల్లోకి తీసుకున్నామని పేర్కొంది. అలాగే అహ్మదాబాద్ విద్యార్థులకూ తమ సంస్థలో అవకాశం ఇస్తామని ప్రకటించింది. ప్లేస్మెంట్ సెల్ నుంచి తమకు ఈమెయిల్స్ అందాయనీ, ఇంటర్వ్యూ తర్వాత ఎంపిక చేస్తామన్నారు. రాబోయే రెండు వారాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మరోవైపు బాధిత గ్రాడ్యుయేట్లు తమను వ్యక్తిగతంగా కలిశారని మరో ఈకామర్స్ సంస్థ షాప్ క్లూస్ తెలిపింది. తమకు ఇప్పటివరకు రెండు ఇమెయిల్స్ అందాయని షాప్ క్లూస్ సహ స్థాపకులు రాధిక అగర్వాల్ తెలిపారు. కాగా, తమ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై అహ్మదాబాద్ ఐఐఎం మేనేజ్ మెంట్ ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బన్సాల్, బిన్నీ బన్సాల్ లను ఉద్దేశించి ఘాటు లేఖ రాసిన సంగతి తెలిసిందే.