ప్రియుని ఇంటి ముందు మౌన దీక్ష | Hyderabad Woman Silence Protest Infront Of Boyfriend House Prakasam | Sakshi
Sakshi News home page

ప్రియుని ఇంటి ముందు మౌన దీక్ష

Aug 15 2018 1:01 PM | Updated on Aug 15 2018 1:01 PM

Hyderabad Woman Silence Protest Infront Of Boyfriend House Prakasam - Sakshi

ఎస్‌ఆర్‌నగర్‌ ఎస్‌ఐతో ఫోన్‌లో మాట్లాడుతూ రేణుకకు సర్దిచెప్తున్న ముండ్లమూరు ఎస్‌ఐ

ప్రకాశం, ముండ్లమూరు: మండలంలోని ఈదర పంచాయతీ పరిధిలోని అయోధ్యనగర్‌లో ప్రియుని ఇంటి ముందు ప్రియురాలు మౌన దీక్ష  చేపట్టింది. హైదరాబాద్‌ బోరుబండకు చెందిన తోట రేణుక గ్రామానికి చెందిన నారు నాగ శ్రీనివాసరెడ్డి ఇంటి ముందు మంగళవారం దీక్ష చేపట్టింది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ శివనాంచారయ్య సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకొని రేణుకను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సం దర్భంగా రేణుక మాట్లాడుతూ తనతో రెండేళ్లుగా పరిచయం పెంచుకొని  ప్రేమ పేరుతో నాగ శ్రీని వాసరెడ్డి మోసం చేశాడని తెలిపింది.

15 రోజులుగా కనిపించకుండా పోవడంతో వెతుక్కుంటూ అయోధ్యనగర్‌ వచ్చానని చెప్పింది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో తనని మోసం చేసినట్లు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తెలిపింది. దీంతో ఎస్‌ఐ శివనాంచారయ్య ఎస్‌ఆర్‌నగర్‌ ఎస్‌ఐతో ఫోన్‌లో మాట్లాడారు. రేణుకతో ఫోన్‌ మాట్లాడించగా తనకి న్యాయం చేస్తానని ఎస్‌ఆర్‌నగర్‌ ఎస్‌ఐ ఫోన్‌లో సర్ది చెప్పడంతో అక్కడి నుంచి దీక్ష విరమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement