ప్రశ్నించారని రెచ్చిపోయాడు

Husband Knife Attack on Wife in Siddipet - Sakshi

తమ అక్కను పనికెందుకు పంపుతున్నావని అడిగిన బావమరుదులు

భర్త ఆగ్రహం:భార్యపై గొడ్డలితో దాడి

అడ్డుకోబోయిన ఇద్దరికి గాయాలు

అనంతరం పారిపోబోతుండగా భర్త తలకు తీవ్ర గాయం

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యాభర్తలు, మరో ఇద్దరు

సిద్దిపేటకమాన్‌: మూడు ముళ్లు వేసి, ఏడు అడుగులు నడిచి కలకాలం కలిసి ఉంటానని భరోసా ఇచ్చిన కట్టుకున్న భర్తనే భార్య పట్ల కసాయిగా మారాడు.  కుటుంబకలహాలతో కట్టుకున్న భార్యపై గొడ్డలితో భర్త హత్యాయత్నం చేసిన సంఘటన సిద్దిపేట పట్టణంలోని హనుమాన్‌ నగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది.  సిద్దిపేట టూటౌన్‌ పోలీస్‌ల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు మండలం ఏలేశ్వరం గ్రామానికి చెందిన మ్యాకల లక్ష్మి, శంకర్‌ దంపతులు గత కొద్దికాలంగా సిద్దిపేట పట్టణంలోని హనుమాన్‌నగర్‌ మహేశ్వర రైస్‌మీల్‌ దగ్గరలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. శంకర్‌ గత కొద్దిరోజులుగా పనికి వెళ్లకుండా ఇంటిదగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలో శంకర్‌ భార్య లక్ష్మి కుటుంబ పోషణ నిమిత్తం కూలీ పనులకు Ððవెళ్తోంది. శంకర్‌ కూలీ పనికి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉండడాన్ని గుర్తించిన శంకర్‌ బావమరుదులైన రాసూరి శ్రీను, రాఘవలు మా అక్క లక్ష్మిని ఎందుకు పనికి పంపిస్తున్నావు, నీవు పనికి ఎందుకు వెళ్లడం లేదని శంకర్‌ను ప్రశ్నించారు.

దీంతో నన్నే ప్రశ్నిస్తారా అని ఆగ్రహించిన శంకర్‌ ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకుని లక్ష్మిపై హత్యాయత్నం చేశాడు. దీనిని అడ్డుకోబోయిన శ్రీను, రాఘవలకు గాయాలయ్యాయి. భార్య లక్ష్మి ఎడమభుజంపై తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన రైస్‌మిల్‌ యజమాని, స్థానికులు ఘటన స్థలానికి రావడాన్ని గమనించిన శంకర్‌ ఇంటి గోడ దూకి  పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో శంకర్‌ తలకు రాయితగిలి  తీవ్ర రక్తస్త్రావం అయింది. గమనించిన స్థానికులు 108కి సమాచారం అందించగా వారు గాయపడిన వారిని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలైన లక్ష్మిని వైద్యులు చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రిఇకి తరలించారాఉ. గాయపడిన శంకర్, శ్రీను, రాఘవాలు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్ష్మి తమ్ముడు శ్రీను ఫిర్యాదు మేరకు సిద్దిపేట టూటౌన్‌ పోలీసులు  శంకర్‌పైన కేసు నమోదు చేసి దర్యాప్తు     చేస్తున్నామని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top