అడుక్కుంటూ వెళ్లి అనంతలోకాలకు | Girl Died In Road Accident In Mancherial | Sakshi
Sakshi News home page

అడుక్కుంటూ వెళ్లి అనంతలోకాలకు

Jul 9 2019 11:49 AM | Updated on Jul 9 2019 11:52 AM

Girl Died In Road Accident In Mancherial - Sakshi

మృత దేహాన్ని అంబులెన్స్‌లోకి తరలిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు

సాక్షి, మంచిర్యాల : ఏ తల్లి కన్నదో తెలియదు.. ఏ ఊరో తెలియదు.. మూడు సంవత్సరాల వయసులో మంచిర్యాలకు వచ్చి రైల్వే స్టేషన్లో బిక్షాటన చేసుకుంటూ 8 సంవత్సరాలుగా అమ్మనాన్న ప్రేమకు దూరమై కడు దుర్భరమైన జీవితం సాగిస్తోంది. చిన్నారి పడుతున్న కష్టాలు చూడలేక దేవుడు తన వద్దకు తీసుకెళ్లాడని స్థానికులు కంటతడి పెట్టారు.వివరాల ప్రకారం..మంచిర్యాల రైల్వే స్టేషన్లో రమ్య(11) బిక్షాటన చేసుకుంటూ జీవనం సాగించేది.8 సంవత్సరాల నుంచి రమ్య అస్లామ్‌ఖాన్‌ దంపతులు వద్దనే ఉంటుంది.

ఈ నేపథ్యంలో సోమవారం రమ్య లక్ష్మీటాకీస్‌ సమీపంలోని స్వీట్‌ హౌజ్‌ వద్ద  బిక్షాటన చేసుకొని రోడ్డు దాటుతుండగా బెల్లంపెల్లి వైపు నుంచి వస్తున్న యాస్‌ ట్యాంకర్‌ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్సై మారుతి ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎండీ అస్లామ్‌ఖాన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement