బాక్సర్‌ దారుణ హత్య | Former Boxer Jitender Mann Found Dead in Greater Noida Flat | Sakshi
Sakshi News home page

బాక్సర్‌ జితేందర్‌ దారుణ హత్య

Jan 13 2018 11:16 AM | Updated on Nov 6 2018 8:50 PM

Former Boxer Jitender Mann Found Dead in Greater Noida Flat - Sakshi

నోయిడా : హర్యానాకు చెందిన మాజీ బాక్సర్‌ జితేందర్‌ మన్‌ శుక్రవారం అనుమానాస్పదంగా హత్యకు గురయ్యాడు. జెటా సెక్టార్‌లోని ఏవీజే హైట్స్‌ అపార్ట్‌మెంట్‌లో తన ఇంటిలో శవమై కనిపించాడు. జితేందర్‌ను కలవాడినికి ప్రీతం అనే స్నేహితుడు జితేందర్‌ ప్లాట్‌ వెళ్లాడు. ఎంతసేపటికి తలపుతట్టినా తీయకపోవడంతో బద్దలు కొట్టి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే ప్రీతం పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.

దీనిపై ఎస్పీ సునీత్‌ మట్లాడుతూ జితేందర్‌ శరీరంపై పలు బుల్లెట్‌ గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక జితేందర్‌ విషయానికి వస్తే జూనియర్‌ బాక్సింగ్‌లో భారత్‌ తరపున ఉబ్జెకిస్తాన్‌, క్యూబా, ఫ్రాన్స్‌, రష్యాలతో పాటు పలు అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌ బాక్సింగ్‌ పోటీల్లో పాల్గొన్నాడు. గాయాల కారణంగా గత ఏడు నెలల క్రితం బాక్సింగ్‌కు వీడ్కొలు పలికి జిమ్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడు. అయితే శుక్రవారం అనుమానాస్పదంగా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హత్యకు గురయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement