ఐదేళ్ల చిన్నారిపై తండ్రి వికృత చేష్టలు..

Father Who Sexually Abused Daughter - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి(జంగారెడ్డిగూడెం): ఐదేళ్ల చిన్నారిపై కన్న తండ్రే లైంగిక చేష్టలకు పాల్పడుతున్న ఘటన వెలుగుచూసింది. తండ్రి చేష్టలు పరాకాష్టకు చేరడంతో భరించలేక ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పంగిడిగూడెం రోడ్డులో నివసిస్తున్న ఐదేళ్ల చిన్నారిని తండ్రే చాలా కాలంగా లైంగిక చేష్టలతో వేధిస్తున్నాడని చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త ఇంటి వద్ద ఉన్నప్పుడు చిన్నారిని కాపాడుకుంటున్నానని, తన తల్లి వద్ద కూడా చిన్నారిని కొంతకాలం దాచానని చిన్నారి తల్లి ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు చిన్నారిని వైద్యపరీక్షలకు పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top