సిరిసిల్ల జిల్లాలో జంటహత్యలు | Father And Son Brutally Murdered In Rajanna Sircilla District | Sakshi
Sakshi News home page

సిరిసిల్ల జిల్లాలో జంటహత్యలు

Jun 12 2018 12:07 PM | Updated on Aug 21 2018 6:08 PM

Father And Son Brutally Murdered In Rajanna Sircilla District - Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం తండ్రి కొడుకులు దారుణహత్యకు గురయ్యారు. జిల్లాలోని ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు తండ్రి కొడుకులను కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ జంట హత్యల ఘటన స్థానికంగా కలకం రేపింది. గ్రామానికి చెందిన ఎల్లయ్య, అతని కొడుకును అదే గ్రామానికి చెందిన వ్యక్తులు గొడ్డలితో దాడి చేసి హతమార్చారు.

పొలం విషయంలో ఈ హత్యలు జరిగినట్టు తెలుస్తోంది. ఈరోజు తెల్లవారుజామున పొలంలో ఉన్న తండ్రికొడుకులను హత్యచేసిన నిందితులు ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement