అనసూయ పేరుతో అభ్యంతరకర పోస్టులు | Fake Posts in Social Media on Anasuya Named | Sakshi
Sakshi News home page

అనసూయ పేరుతో అభ్యంతరకర పోస్టులు

Jul 22 2019 8:22 AM | Updated on Jul 22 2019 8:35 AM

Fake Posts in Social Media on Anasuya Named - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నటి, యాంకర్‌ అనసూయ పేరుతో ఫేస్‌బుక్‌లో ఏర్పాటైన పేజ్‌ల ద్వారా అభ్యంతరకరమైన పోస్టులు, ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రొగ్రెసివ్‌ యూత్‌ లీగ్‌ (పీవైఎల్‌) ఆదివారం హైదరాబాద్‌ నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. కొన్ని యాప్స్‌లోనూ వీడియోలు, ఫొటోలు పేరుతో ఈ దుష్ప్రచారం జరుగుతోందని వారు పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళారు. రాష్ట్ర కార్యదర్శి కేఎస్‌ ప్రదీప్‌ నేతృత్వంలోని బృందం ఈ ఫిర్యాదు అందజేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు సోమవారం మరోసారి రావాలని చెప్పినట్లు ప్రదీప్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement