విద్యార్థిని ఆత్మహత్య.. 3 పేజీల సూసైడ్‌ నోట్‌ | Engineering Student Suicide in Tamil Nadu Foung Suicide Note | Sakshi
Sakshi News home page

ఓమలూరులో విద్యార్థిని ఆత్మహత్య

Jan 13 2020 9:22 AM | Updated on Jan 13 2020 10:31 AM

Engineering Student Suicide in Tamil Nadu Foung Suicide Note - Sakshi

నివేద (ఫైల్‌)

ఒక విద్యార్థినితో రాసలీలలు సాగించినట్లు ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేసినట్టు తెలిసింది.

చెన్నై, సేలం: ఓమలూరులో ఇంజినీరింగ్‌ విద్యార్థిని హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడింది. సేలం జిల్లా ఓమలూరు సమీపంలో పెరియార్‌ యూనివర్సిటీ ఉంది. ఓమలూరులో ఉన్న ఇంజినీరింగ్‌ కళాశాల హాస్టల్లో ఓ విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఉదయం విషయం తెలిసి కళాశాల నిర్వాహకులు కరుప్పూర్‌ పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న సూర మంగళం ఇన్‌స్పెక్టర్, సేలం డిప్యూటీ కమిషనర్‌ తంగదురై, అసిస్టెంట్‌ కమిషనర్‌ సెల్వరాజ్‌ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు.

విచారణలో విద్యార్థిని ధర్మపురి జిల్లా పాపిరెడ్డిపట్టికి చెందిన తిరుమలై కుమార్తె నివేద అని, ఆమె ఆ కళాశాలలో పీహెచ్‌డీ రెండో సంవత్సరం చదువుతున్నట్టు తెలిసింది. ఆమె మృత దేహం వద్ద మూడు పేజీల సూసైడ్‌ నోట్‌ చిక్కినట్లు సమాచారం. అనంతరం పోలీసులు నివేద మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం సేలం జీహెచ్‌కు తరలించి దర్యాప్తు చేపట్టారు.  కాగా, ఈ విభాగం హెచ్‌ఓడీ ఒక విద్యార్థినితో రాసలీలలు సాగించినట్లు ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేసినట్టు తెలిసింది. దీంతో సూరమంగళం పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ దిశగా విచారణ జరుపుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement