ప్రియుడితో కలిసి తల్లితండ్రులను కడతేర్చింది

Daughter kill Parents For Objecting To Love Marriage - Sakshi

ముంబై : నాగపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం హత్యకు గురైన వృద్ధ దంపతుల కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. తాను ప్రేమించిన క్రికెటర్‌తో వివాహం చేసేందుకు నిరాకరించారనే కోపంతో బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి తల్లితండ్రులను వారి దత్త పుత్రిక అత్యంత పాశవికంగా హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు. నిందితురాలు ప్రియాంక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తుండగా, ఆమె బాయ్‌ఫ్రెండ్‌ మహ్మద్‌ అఖ్లాక్‌ రాష్ట్రస్ధాయి క్రికెట్‌ ఆటగాడు. తమ వివాహానికి యువతి తల్లితం‍డ్రులు అభ్యంతరం చెప్పడంతో వారి అడ్డుతొలగించుకోవాలని ప్రేమికులు స్కెచ్‌ వేశారు.

గతంలోనూ వృద్ధ దంపతులను చంపేందుకు ప్లాన్‌ చేశానని అఖ్లాక్‌ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. నాగపూర్‌లోని వాడిలో తమ అపార్ట్‌మెంట్‌లో శంకర్‌ చంపటి(72), సీమా (64)లు ఆదివారం విగతజీవులుగా పడిఉండటాన్ని పోలీసులు గుర్తించారు. వారి తలపై బలమైన గాయాలున్నాయని పోలీసులు చెప్పారు. వారిని హత్య చేసే ముందు వారికి ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో పేర్కొన్నారు. ప్రియాంక, అఖ్లాక్‌లు నేరానికి పాల్పడినట్టు విచారణలో అంగీకరించారని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top