రెండో వివాహం చేసుకుంటూ... | Constable Caught Red Handedly While Second Marriage In Karnataka | Sakshi
Sakshi News home page

రెండో వివాహం చేసుకుంటూ...

Jul 10 2018 6:45 AM | Updated on Mar 19 2019 5:52 PM

Constable Caught Red Handedly While Second Marriage In Karnataka - Sakshi

మైసూరు: జీవిత బీమా పత్రాలని నమ్మించి భార్యతో విడాకుల పత్రాలపై సంతకాలు చేయించుకొని రెండవ వివాహం చేసుకుంటూ కానిస్టేబుల్‌ మొదటి భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఘటన సోమవారం మైసూరు నగరంలో చోటు చేసుకుంది. జిల్లాలోని హుణుసూరు తాలూకా గాడిహొసహళ్లి గ్రామానికి చెందిన రాజాచారికి అదే ప్రాంతానికి చెందిన సవితా అనే మహిళతో 18 సంవత్సరాల క్రితం వివాహమైంది. కేఎస్‌ఆర్‌పీలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న  రాజాచారికి ఫేస్‌బుక్‌లో ఓ యువతితో పరిచయమైంది.

ఈ పరిచయం కాస్తా ప్రేమకు దారి తీయడంతో యువతిని రెండో వివాహం చేసుకోవడానికి మొదటి భార్య నుంచి విడాకులు పొందడానికి పథకం వేశాడు. ఈ క్రమంలో మూడు నెలల క్రితం సంతకాలు చేయించుకున్నాడు. అనంతరం సోమవారం నగరంలోని యోగా నరసింహదేవాలయంలో గుట్టుచప్పుడు కాకుండా రెండవ వివాహానికి సిద్ధమయ్యాడు. భర్త రెండో వివాహం విషయం తెలుసుకున్న సవితా దేవాలయానికి చేరుకొని భర్తకు దేహశుద్ది చేసి భర్తను పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి లాక్కొచ్చారు. పోలీసులు దంపతుల మధ్య రాజీ కుదిర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement