ఎస్‌ఐ రాసలీలలు

SI Fornication Relation With Constable Wife In Karnataka - Sakshi

అగ్నిప్రమాదంతో వివాహేతర సంబంధం గుట్టురట్టు

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ భార్య అరెస్ట్‌

సాక్షి, బళ్లారి: కానిస్టేబుల్‌ భార్యతో జిల్లా ఎస్పీ ఆఫీసులోని వైర్‌లెస్‌ విభాగం ఎస్‌ఐ కిరణ్‌ సామ్రాట్‌ నెరుపుతున్న అనైతిక సంబంధం అగ్నిప్రమాదంతో గుట్టురట్టయ్యింది. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.  వివరాలు.. నగరంలోని పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉండే సబ్‌ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌ సామ్రాట్, తాలూకాలోని పరమదేవనహళ్లి పోలీసు స్టేషన్‌లో పని చేస్తూ స్థానిక పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉన్న ఓ కానిస్టేబుల్‌ భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.

గత బుధవారం రాత్రి ఇద్దరూ కలిసి ఉండగా తాగిన మైకంలో ఉన్న ఎస్‌ఐ కిరణ్‌ సామ్రాట్‌ సిగరెట్‌ కాల్చి నిప్పురవ్వలను కింద పడేయగా సోఫాసెట్‌తో పాటు ఇంట్లో సామగ్రికి నిప్పంటుకుంది. మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో భయంతో ఇద్దరు బయటకు పరుగెత్తుకొచ్చారు. దీంతో వారి మధ్య ఉన్న వివాహేతర సంబంధం గుట్టు రట్టయింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ భార్య ఒకేసారి ఇంట్లో నుంచి బయటకు రావడంతో పోలీసు క్వార్టర్స్‌లోని తోటి పోలీసులు ముక్కన వేలు వేసుకున్నారు. ప్రమాదానికి కారణమైన ఇద్దరిపై కానిస్టేబుల్‌ స్థానిక గాంధీనగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సమగ్రంగా దర్యాప్తు చేసిన తర్వాత శుక్రవారం ఎస్‌ఐతో పాటు కానిస్టేబుల్‌ భార్యను అరెస్ట్‌ చేశారు. కానిస్టేబుల్‌ భార్యకు ఇద్దరు సంతానం కూడా ఉన్నారు. ఈ ఘటనపై గాంధీనగర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top