గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం | Car Crushed Between Two Trucks in Gujarat | Sakshi
Sakshi News home page

ఘోర రోడ్డు ప్రమాదం...10 మంది మృతి

Dec 31 2018 10:09 AM | Updated on Dec 31 2018 1:41 PM

Car Crushed Between Two Trucks in Gujarat - Sakshi

రెండు ట్రక్కుల మధ్య నుజ్జునుజ్జయిన కారు

గాంధీనగర్‌ : గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మృతిచెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు... బంధువుల ఇంటికి వెళ్లిన ఓ కుటుంబం(11 మంది)ఆదివారం సాయంత్రం తమ స్వస్థలం భుజ్‌కు చేరుకునేందుకు కారు(స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనం)లో బయల్దేరింది. వీరి కారు బచావ్‌ హైవే గుండా ప్రయాణిస్తున్న సమయంలో... రోడ్డుకు ఆవలి వైపు నుంచి వస్తున్న ఓ ట్రక్కు... డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. వీరి కారుకు సమాంతరంగా ప్రయాణిస్తున్న మరో ట్రక్కుపై పడింది. దీంతో రెండు ట్రక్కుల మధ్య ఇరుక్కున బాధితుల కారు నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో 10 మంది అక్కడిక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రిలో చేర్పించినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement