
మండ్య: కర్ణాటకలోని చిక్కబళ్లాపుర జిల్లాలో ఇటీవల ప్రియురాలిని నరికివేసి ఆమె తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఉన్మాద ప్రియుడి దురంతం మరువక ముందే అలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది. తన తల్లిని అసభ్యంగా తిట్టాడనే కసితో ఓ వ్యక్తి తన మిత్రుడిని నరికి.. మృతుని తల తీసుకుని పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన ఘటన మండ్య జిల్లాలోని చిక్కబాగిలులో జరిగింది.
నిందితుడు పశుపతి (28), హతుడు గిరీశ్ (38) చిన్ననాటి నుంచి స్నేహితులు. కొద్దిరోజుల కిందట గిరీశ్.. ఒక విషయంలో పశుపతి తల్లిని తిట్టాడు. అప్పటినుంచి మనసులో పగ పెంచుకున్న పశుపతి శనివారం ఉదయం మాట్లాడాలని గిరీశ్‌ను ఊరిబయటకు తీసుకెళ్లి కత్తితో గొంతుకోసి చంపాడు. గిరిశ్ తలతో నిబ్బరంగా 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న మళవళ్లి పీఎస్‌కు బైక్‌పై వచ్చి పశుపతి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.