నవ వధువు ఆత్మహత్య | Bride Commits Suicide in Hyderabad | Sakshi
Sakshi News home page

నవ వధువు ఆత్మహత్య

Sep 20 2019 8:39 AM | Updated on Sep 20 2019 8:39 AM

Bride Commits Suicide in Hyderabad - Sakshi

ఉప్పల్‌: పెళ్లై నాలుగు నెలలకే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఉప్పల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రామంతాపూర్‌ వివేక్‌నగర్‌లో నివాసముడే చెంబేటి రాజేష్‌కు దిల్‌సుఖ్‌నగర్‌ నివాసి రాశి(23)తో నాలుగు నెలల క్రితం వివాహమైంది. రాజేష్‌ హిమాయత్‌నగర్‌లోని బోన్సాయి మొక్కల గార్డెన్‌లో పనిచేస్తాడు. నిత్యం మద్యం తాగుతున్న ఇతడికి భార్యకు గొడవలు జరిగేవి. గురువారం కూడా మద్యం తాగవద్దని రాశి భర్తను వారించడంతో మళ్లీ ఫోన్‌ వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఫోన్‌ పేట్టేసి గదిలోకి వెళ్లి అత్త చూస్తుండగానే  గడియ పెట్టుకుంది. ఈలోపు రాజేష్‌ తల్లికి ఫోన్‌చేసి విషయం చెప్పగా అప్పటికే గదిలోకి వెళ్లిన రాశి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement