షేక్‌పేట్‌ ఎమ్మార్వో సుజాత అరెస్ట్‌ | Banjara Hills Land Issue Case : MRO Sujatha Arrested | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌ భూవివాదం : ఎమ్మార్వో సుజాత అరెస్ట్‌

Jun 8 2020 7:27 PM | Updated on Jun 8 2020 8:04 PM

Banjara Hills Land Issue Case : MRO Sujatha Arrested - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బంజారాహిల్స్‌ భూవివాదం కేసులో ఎమ్మార్వో సుజాతను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. సోమవారం ఉదయం నుంచి సుదీర్ఘంగా విచారించిన ఏసీబీ అధికారులు.. భూ వివాదం కేసులో ఆమె పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఎమ్మార్వో సుజాతను అరెస్ట్‌ చేసి, అనంతరం వైద్యపరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరికాసేపట్లో ఎమ్మార్వో సుజాతను న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. విచారణలో భాగంగా ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఎమ్మార్వో సుజాత పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. ఇంట్లో దొరికిన రూ.30 లక్షలకు ఆధారాలు చూపలేకపోయరని సమాచారం. ఇదే కేసులో ఇప్పటికే బంజారాహిల్స్‌ ఎస్సై రవి నాయక్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement