
ప్రమాదానికి గురైన ఆటో, అంతర్ చిత్రంలో క్షతగాత్రులను తరలిస్తున్న దృశ్యం
పత్తి చేనులో పనిచేసేందుకు శాలిగౌరారం నుంచి ఆటోలో వెళ్తుండగా
సూర్యాపేట జిల్లా: సూర్యాపేట రూరల్ మండలం అచ్చ తండా వద్ద ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆటో ప్రయాణిస్తున్న 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. పత్తి చేనులో పనిచేసేందుకు శాలిగౌరారం నుంచి ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి బోల్తా పడింది. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.